వరుణ్ కాస్త ఆలోచించాల్సింది
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం గాండివధారి అర్జున. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్ర మేకర్స్. ఆగస్ట్ 25న గాండివధారి అర్జున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే ఆగస్ట్ 11న చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
అంటే చిరూకి, వరుణ్ కు మధ్య గ్యాప్ రెండు వారాలు మాత్రమే. ఇది చాలా ఎక్కువ గ్యాపే కానీ భోళా శంకర్ తో పాటూ అదే టైమ్ లో యానిమల్, జైలర్ గదర్2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కాస్త ఆలోచించి డెసిషన్ తీసుకుని ఉండాల్సింది. అసలే పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఇది.
ఆగస్ట్ 11న రీలజ్ అయ్యే ఏ ఒక్క సినిమా బాగుండి హిట్ అయినా వరుణ్ సినిమాకు థియేటర్ల కొరత తప్పదు. ఇదిలా ఉంటే ప్రవీణ్ సత్తారు మాత్రం ఈ సినిమా రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, వరుణ్ కు ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది.













