గేమ్ ఛేంజర్ విషయంలో దాని గురించే మర్చిపోయారుగా !
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటూ శంకర్ ఇండియన్2ను కూడా పూర్తి చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ పూర్తవడం లేటవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
కానీ గేమ్ ఛేంజర్ ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలో మాత్రం నిర్మాత అయిన దిల్ రాజు కు కూడా క్లారిటీ లేదు. కొంత మంది డైరెక్టర్లు పర్ఫెక్షన్ ను కోరుకుంటారని, అలాంటి వారిని మనం తొందర పెట్టకూడదని ఆ మధ్య దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ లో మీడియా సాక్షిగా చెప్పాడు. అయితే మొన్నా మధ్య ఈ సినిమా నుంచి జరగండి అనే ఆడియో లీక్ అయి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో హై క్వాలిటీతో వైలర్ అయిన ఆ సాంగ్ ను చిత్ర బృందం అలెర్ట్ అయి డిలీట్ అయితే చేయించారు కానీ ఇప్పటికే అందరి ఫోన్స్ లో ఆ పాట సేవ్ అయి ఉంది. దీంతో జరిగిన డ్యామేజ్‌ను తగ్గించాలని ఆ సాంగ్‌ను రిలీజ్ చేద్దామని డేట్ తో సహా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కానీ ఎందుకో ఆ పాటను అప్పుడు రిలీజ్ చేయలేదు. మళ్లీ అప్డేట్ ఇస్తామని సైలెంట్ అయ్యారు మేకర్స్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సాంగ్ ను గురించి ఎలాంటి అప్‌డేట్‌నూ గేమ్ ఛేంజర్ టీమ్ ఇవ్వలేదు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సాంగ్ ను కూడా రిలీజ్ చేయాలని శంకర్ చెప్పడం వల్లే ఆ సాంగ్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారని తెలుస్తోంది.













