Game Changer: డల్లాస పురం నాకెంతో నచ్చింది: రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). రామ్ చరణ్ (Ram Charan) సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవల్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి తదితరులు పాల్గొన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘డల్లాస్‌లోని అభిమానులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక్కడి వారు చూపించిన ప్రేమాభిమానాలతో మాటలు కూడా రావటం లేదు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్ర, తెలంగాణల్లో ఉన్నామా! లేక డల్లాస్‌కు వచ్చామా! అనేది కూడా అర్థం కావటం లేదు. లవ్ యు ఆల్. అందరూ నాపై ప్రేమతో ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్. ఓవర్‌సీస్‌లోని ప్రజలే ముందుగా సినిమాను చూస్తారు. అందుకే ఇక్కడ నుంచే ప్రమోషన్స్‌ను మొదలు పెడుతున్నాం. మా ‘గేమ్ చేంజర్’కు మీ అందరి ఆశీస్సులు కావాలి. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన రాజేష్ కల్లెపల్లి అండ్ టీమ్‌కు స్పెషల్ థాంక్స్. జనవరి 10న రిలీజ్ అవుతోన్న ‘గేమ్ ఛేంజర్’ను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్పీచ్ మెగా ఫ్యాన్స్‌ని ఉత్సాహపరచింది. మైక్ అందుకున్న రామ్ చరణ్ ఈ హంగామా చూస్తే అమెరికాకు వచ్చినట్టు లేదు ఇండియాలోనే ఉన్నట్టు ఉందని అన్నారు. అందుకే డల్లాసపురం అని ఊరికే అనరేమో అని అన్నారు. ఇక్కడకు వచ్చిన సినిమా అభిమానులకు థాంక్స్ అన్నారు చరణ్. తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అని.. శంకర్ గారి పక్కన ఆయన సినిమాలో నటించానా అని అనుకుంటున్నా అని అన్నారు. ఎన్నోసార్లు శంకర్ గారిని కలిసినప్పుడు తెలుగులో సినిమా చేయడని చెబుదామనుకున్నా కానీ ఎప్పుడు చెప్పలేదు. నాతో కాదు ఎవరితో అయినా చేయండని చెప్పాలని అనిపించిందని అన్నారు చరణ్. ఆయనతో ఈ 3 ఏళ్ల జర్నీలో ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లేప్పుడు న్యూ బిగినింగ్ లా అనిపించేదని అన్నారు.
క్రికెట్ లో సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ సార్ అలా అని అన్నారు. ఆయనలా సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ ఎవరు లేరని అన్నారు. నంబర్ 1 కమర్షియల్ డైరెక్టర్.. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా శంకర్ గారని అన్నారు చరణ్. అలాంటి శంకర్ గారితో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చినందుకు పేరెంట్స్ కి, గాడ్ కి థాంక్స్ అని అన్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బ్రదర్ ఎన్టీఆర్ తో చేశా సోలో సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుందని ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందని అన్నారు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. తన దర్శకుల దగ్గర నుంచి ఇదే నేర్చుకున్నా అని అన్నారు రాం చరణ్. దిల్ రాజు గురించి చెబుతూ ఆయనతో పనిచేయడం ఎప్పుడూ బాగుంటుంది. మా ఇండస్ట్రీకి రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఉన్నారని అన్నాడు చరణ్. దిల్ రాజు, థమన్ స్పీచ్ లలో ఈసారి థమన్ మార్కులు కొట్టేశాడని సరదాగా చరణ్ చెప్పారు.
ఫ్యాన్స్ కోరిక మేరకు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది ఒక మెమొరబుల్ వీడియోగా తాను ఇండియాకు తీసుకెళ్తా అని అన్నారు. యూఎస్ మార్కెట్ నైజా, ఆంధ్ర రెవిన్యూ లాగా వస్తుందని ఇక్కడ ట్రూ సినిమా లవర్స్ ఉన్నారని అన్నారు. దేశం కానీ దేశంలో మీరు మాపై ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. శంకర్ గారి సినిమాల్లో ఉండే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాలొ ఉంటుంది. సినిమా అవుట్ అడ్ అవుట్ ఎంజాయ్ చేస్తారని చరణ్ అన్నారు. ఇంతలో ఓజీ గురించి ఫ్యాన్స్ కేకలు వేస్తుండగా తాను కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు. బాబాయ్ వస్తా అంటే తన సినిమా ఆపేవాడినని అన్నారు. సంక్రాంతికి విశ్వంభర రావాల్సి ఉన్నా ఈ సినిమా కోసం అది వాయిదా వేశారని ఆ సినిమా యూనిట్ కు థాంక్స్ అని అన్నారు చరణ్. ఈ సంక్రాంతి అన్ ప్రెడిక్టబుల్ అంటూ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తూ తన స్పీచ్ ముగించారు చరణ్.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ను పెట్టినప్పుడే సరికొత్తగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా డల్లాస్‌ను సెలక్ట్ చేసుకున్నాం. యు.ఎస్‌లో ఇంత భారీగా ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించటం అనేది ఇదే తొలిసారి. టైటిల్‌కు తగ్గట్లే ఈవెంట్‌ను చేయాలని చేశాం. దానికి రాజేష్, ముందుకొచ్చి సపోర్ట్ చేశారు. గ్లోబల్ స్టార్ గేమ్ ఛేంజర్ అన్‌ప్రిడెక్టబుల్’’ అన్నారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు స్పీచ్ మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఆయన ఎనర్జీ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. చిరంజీవి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేశాం కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎంజాయ్ చేశా.. ఇప్పుడు చరణ్ తో సినిమాలు నిర్మిస్తూ ఎంజాయ్ చేస్తున్నా అని అన్నారు దిల్ రాజు. ఎవడు చేశాం మళ్లీ 11 ఏళ్లకు గేం ఛేంజర్ వస్తోందని అన్నారు. మెగా ఫ్యామిలీతో తన బాండిరగ్ కొనసాగుతుందని అన్నారు దిల్ రాజు. శంకర్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశా.. ఆయన నిర్మించిన సినిమా తెలుగు రిలీజ్ చేశా.. ఆయన తో కలిసి సినిమా చూసి చాలా సంతోషపడ్డానని అన్నారు. శంకర్ గారితో భారీ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్నా.. గేమ్ ఛేంజర్ తో అది కుదిరింది. ఈ సినిమాలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈమధ్య జరిగిన కొన్ని విషయాలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఈమధ్య జరుగుతున్న విషయాలను ప్రతిభింభిస్తాయని అన్నారు దిల్ రాజు.
సంక్రాంతికి వస్తున్నాం.. కొడుతున్నాం.. కొడుతున్నాం.. గట్టిగా కొడుతున్నామని అన్నారు. శంకర్ డైరెక్షన్ లో చరణ్ సినిమా చేయడం విశేషమని.. ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలకు తగినట్టు ఉంటుందని అన్నారు. మీ ఎనర్జీని ఇలానే ఉంచుకుని సంక్రాంతికి సినిమా రిలీజ్ రోజు చూపించండని అన్నారు దిల్ రాజు. శంకర్ గారు సాంగ్స్ లో కూడా ఆయన మార్క్ చూపించారని అన్నారు. ఇక ఆయన విజయ్ వారిసు టైం లో చెప్పిన ఫైట్స్ వెనుమా.. ఫైట్స్ ఇరుక్కు.. సాంగ్స్ వెనుమా సాంగ్స్ ఇరుక్కు.. అంటూ అదే డైలాగ్ రిపీట్ చేసి ఫ్యాన్స్ లో హుశారు నింపారు.
ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు గేమ్ చేంజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్. తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది.