Game Changer: గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే
రామ్ చరణ్(Ram charan) హీరోగా కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్(Game changer). బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కగా నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు ఈ సినిమా చాలా నష్టాన్నే మిగిల్చింది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో శంకర్(Shankar) మార్క్ మిస్ అవడంతో ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవలేకపోయారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. గేమ్ ఛేంజర్ డిజిటల్ హక్కులు ప్రైమ్ వీడియో(Prime Video) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్‌పై ఇన్‌డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్టబుల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానున్నట్టు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
గేమ్ ఛేంజర్ లో చరణ్ చెప్పిన డైలాగుని ప్రైమ్ వీడియో పోస్ట్ చేయడంతో ఆ అనౌన్స్మెంట్ గేమ్ ఛేంజర్ గురించేనని అందరూ అనుకుంటున్నారు. ఈ వారంలోనే గేమ్ ఛేంజర్ ఓటీటీ అప్డేట్ వస్తుందని, ఫిబ్రవరి 14న సినిమా ఓటీటీలోకి రానుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కు అదనపు కంటెంట్ యాడ్ చేసి రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ప్రైమ్ వీడియోను కోరుతున్నారు.













