దీపావళిని టార్గెట్ చేసిన శంకర్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. భారతీయుడు షూటింగ్ పూర్తవడంతో శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ను వేగవంతం చేయబోతున్నాడు.
అందులో భాగంగానే మైసూరు లో ఓ కీలక షెడ్యూల్ను ప్లాన్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. డైరెక్టర్ ఎప్పుడు సినిమాను పూర్తి చేస్తే అప్పుడు రిలీజ్ ఉంటుందని, ఏదైనా డైరెక్టర్ చేతిలో ఉందని దిల్ రాజు ఇప్పటికే మీడియా ముఖంగా చెప్పేశాడు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే దీపావళికి సినిమాను రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న సినిమా కావడంతో నార్త్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని శంకర్ ఇలా ఫిక్స్ అయ్యడంటున్నారు. దీపావళి టైమ్ లో అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంటుందని, అందుకే గేమ్ ఛేంజర్ ను ఆ టైమ్ కు ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. అయితే శంకర్ సినిమా పూర్తి చేసే వరకే తన పని. ఎప్పుడు రిలీజ్ అన్నది నిర్మాత దిల్ రాజు చేతుల్లోనే ఉంటుందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.













