గాలి సంపత్ తో మరో హిట్ కొడతాడా?
గాలి సంపత్ సినిమాతో డైరక్టర్ అనిల్ రావిపూడి డైరక్ట్ర్ గా మారుతున్న విషయం తెలిసిందే. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిల్ దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటూ నిర్మాణంలో కూడా షేర్ చేసుకుంటున్నాడు. శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ మరియు తండ్రీ కొడుకుల ఎమోషన్ మీద సాగుతుందని తెలుస్తుంది. అనుకోని ప్రమాదంలో మాట కోల్పోయిన సంపత్.. బావి లో పడి ప్రమాదంలో ఉంటాడు. అక్కడి నుంచి అసలు సంపత్ ఎలా బయటపడ్డాడు? తండ్రిని వెతికే టైమ్ లో కొడుకు పడే ఆవేదనను ఇందులో చూపించనున్నారు. అనిల్ రావిపూడి నిర్మాతగా కూడా సక్సెస్ అవాలని ప్లాన్ చేసుకుని.. గాలి సంపత్ కు అన్నీ తానై ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేస్తున్నాడట.
ఇదిలా ఉంటే అసలు గాలి సంపత్ సినిమా అనుకున్న దానికంటే త్వరగా పూర్తయి బయటకు రావడానికి మెయిన్ రీజన్ షైన్ స్క్రీన్ బ్యానర్ అని టాక్. మజిలీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న షైన్ స్క్రీన్స్ మళ్లీ అదే రేంజ్ హిట్ కొడతామని నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది చిత్ర యూనిట్. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక స్పెషల్ గెస్ట్ ను ఇన్వైట్ చేసి ఇంకా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. మరి గాలి సంపత్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













