మరో సంబరానికి రెడీ అవుతున్న మెగా ఫ్యాన్స్
మొన్న ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేసిన ఇంద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత హంగామా చేసిందో తెలిసిందే. కొత్త సినిమాలకు పోటీగా ఇంద్ర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చేసింది. చిరంజీవి కూడా ఈ సినిమాకు వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్, ఫ్యాన్స్ హంగామా చూసి ఎంతో ఉత్సాహపడ్డాడు. స్వయంగా తనే వీడియో బైట్ రిలీజ్ చేయడమే కాకుండా ఇంద్ర టీమ్ మొత్తాన్ని పిలిచి సన్మానించాడు.
విదేశాల్లో కొన్ని చోట్ల రీరిలీజ్ సినిమాల్లో ఇంద్ర హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. అయితే ఇంద్ర రీరిలీజ్ రన్ ముగుస్తున్న టైమ్ కు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు మరో పండగ వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.
గతంలో కూడా ఈ సినిమాను రీరిలీజ్ చేశారు కానీ ఈసారి హంగామా నెక్ట్స్ లెవెల్ లో ఉండనుంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న ఫస్ట్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ దీన్ని గుర్తుండిపోయేలా చేయాలని డిసైడయ్యారు. ఈ నేపథ్యంలోనే గట్టిగా ప్లాన్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. పెట్టిన షోలు పెట్టినట్లు అయిపోతుండటంతో కొత్త షోలు యాడ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ సెలబ్రేషన్స్ ను నెక్ట్స్ లెవెల్ లో చేయాలని ప్రతి థియేటర్ దగ్గర పవన్ కటౌట్లు పెట్టి హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.













