Gaati: స్వీటీ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి(Baahubali) తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తుందనుకుంటే అనుష్క మాత్రం అందరికీ భిన్నంగా సినిమాలు చేయడం తగ్గించేసింది. బాహుబలి2(Baahubali2) తర్వాత అనుష్క నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఎక్కువ గ్యాప్ తీసుకుని నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)తో కలిసి 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాను చేసిన అనుష్క ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సక్సెసైందిలే ఇకనైనా స్వీటీ వరుస సినిమాలు చేస్తుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆ సినిమా రిలీజై ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ అనుష్క నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం అనుష్క చేతిలో కథనర్(Kathanar) అనే మలయాళ సినిమా ఒకటి, క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి(Ghaati) అనే మరొక సినిమా ఉంది.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చెప్పారు. కానీ ఘాటీ చెప్పిన టైమ్ కు వస్తుందా లేదా అని అందరికీ సందేహాలున్నాయి. ఈ తరుణంలో చిత్ర రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఘాటీ ఏప్రిల్ 18నే రిలీజ్ అవుతుందని చిత్ర బృందం తెలపింది. ఈ విషయం విన్న స్వీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.













