శేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో!
2018లో రిలీజైన గూఢచారి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా G2 రానుంది. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అడివి శేష్ కెరీర్లోనే ఈ సినిమా హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా రూపొందనుంది. G2లో బాలీవుట్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకు నార్త్ లో మంచి బజ్ ఏర్పడే అవకాశముంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ట్విస్టులు ఆడియన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.
గూఢచారి హిట్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. అందుకే ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇండియన్ స్పై థ్రిల్లర్ జానర్ గా డిఫరెంట్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా అడివి శేష్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













