Devara2: దేవర2లో కూడా ఫ్లాష్ బ్యాక్?
కొరటాల శివ(Koratala Siva), ఎన్టీఆర్(NTR) కాంబినేషన్ లో వచ్చిన దేవర1(Devara1) సూపర్ హిట్టవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే దేవరకు కొనసాగింపుగా దేవర2(Devara2) ఉంటుందని క్లైమాక్స్ లో చెప్పారు. సినిమా రిలీజై నాలుగు నెలలవుతున్నా దేవర2కు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వినిపించడం లేదు. మరోవైపు తారక్ వార్2(War2) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
వార్2 పూర్తయ్యాక తారక్(Tarak) ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమాను చేయనున్నాడు. ఆ తర్వాతే దేవర2 ఉండే ఛాన్సుంది. అయితే ఎన్టీఆర్ నీల్ సినిమా పూర్తి చేసుకుని వచ్చే సరికి కొరటాల దేవర2 కోసం మొత్తం సెట్ చేసి ఉంచాలని, తారక్ రెడీ అనగానే సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈసారి కొరటాల దేవర2 స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేట్టు కనిపిస్తున్నాడు.
ముందు అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేసి దేవర ఎలా చనిపోయాడనే పాయింట్ తో పాటూ వర అసలు రూపం బయటపడ్డాక భైరని ఎదుర్కోవడాన్ని కూడా కొరటాల చాలా భయంకరంగా డిజైన్ చేస్తున్నాడట. అంతే కాదు దేవర2లో కూడా దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ గంటకు పైగానే ఉండొచ్చని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో కొన్ని సీన్లకే పరిమితమైన జాన్వీ(Janhvi Kapoor) పాత్ర రెండో భాగంలో కీలకంగా ఉండనున్నట్టు సమాచారం.













