Idli Kadai: ఇడ్లీ కడై సెట్ లో అగ్ని ప్రమాదం
ధనుష్(dhanush) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇడ్లీ కడై(Idli kadai). ధనుష్ దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్(Don Pictures) బ్యానర్ లో ధనుష్, ఆకాష్ భాస్కరన్(Aakash Bhaskaran) నిర్మిస్తున్నారు. నిత్యామీనన్(nithya menon) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ అవకపోవడం వల్ల సినిమా వాయిదా పడింది.
ప్రస్తుతం ఇడ్లీ కడై షూటింగ్ తేని జిల్లాలో వేసిన స్పెషల్ సెట్స్ లో జరుగుతుంది. గత 20 రోజులుగా అక్కడే షూటింగ్ జరుగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అనూహ్యంగా ఇడ్లీ కడై సెట్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెట్స్ లో చెక్క వస్తువులతో పాటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా ఉండటంతో ఆ మంటల తీవ్రత ఎక్కువైందట.
సుమారు గంటన్నర పాటూ సెట్ మొత్తం మంటలతో తగలబడిందని, ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. మంటల్ని చూశాక వాటిని ఆర్పడానికి ట్రై చేసినప్పటికీ ఆల్రెడీ 60 శాతానికి పైగా సెట్ తగలబడిపోయిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.






