అమెరికాకు సర్కార్ బృందం
విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మూడో చిత్రం సర్కార్. రాజకీయ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రైతులకు మద్దతుగా సినిమా కథ ఉంటుందని సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇక ఒకే పాట మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్లింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. విజయ్, కీర్తిసురేష్‌లపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. వరలక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఆమె కూడా చిత్ర బృందంతో పాటు అమెరికా వెళ్లినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.













