మోహన్ బాబుకు ఏడాది జైలుశిక్ష
సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో మోహన్‌బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించినది. 2010లో చెక్‌బౌన్స్ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది.
రూ.48 లక్షల చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్టుకు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన సలీం చిత్రానికి గాను నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ చెల్లకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన కోర్టు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75 లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ఇందుకు సంబంధించి మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు.
బెయిల్ మంజూరు :
ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.40 లక్షలు చెల్లించేందుకు సమ్మతి తెలపడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ సొమ్మును చెల్లించేందుకు మోహన్‌బాబుకు 30 రోజుల గడువు కోరారు.













