ఫెమినా బ్యూటీ అవార్డ్సులో తారల సందడి
ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2019 సందడిగా ముగిసింది. విభిన్నమైన దుస్తులతో బాలీవుడ్ స్టార్స్ మెరిశారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, తాప్సీ పన్ను, విక్కీ కౌసల్ విజేతలుగా నిలిచారు. ఈ అవార్డల ప్రదానోత్సవం ముంబాయిలో జరిగింది. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విక్కీ కౌసల్, సారా అలీఖాన్, తాప్సీపన్ను, టబూ, రవీనా టాండన్, ట్వింకిల్ ఖన్నా, అంకిత లోఖాండే వంటి స్టార్స్ అంతా హాజరయ్యారు. ఇందులో ఏజెల్స్ ఆఫ్ బ్యూటీ అవార్డు రవీనా టాండన్, క్రియేటివ్ ఐకాన్ ఆఫ్ ది డెకెడ్ అవార్డు టబూ, స్టయిల్ పురస్కారం తాప్సీ గెలుచుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా రణవీర్ సింగ్, ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా దీపిక పదుకొనే నిలిచారు.













