Fauji: ఫౌజీ నుంచి ఫోటో లీక్.. మేకర్స్ సీరియస్
ఈ మధ్య లీకుల బెడద అసలు తగ్గడం లేదు. ప్రతీ సినిమాకీ ఈ సమస్య ఎక్కువైపోతుంది. మొన్నా మధ్య మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా157(Mega157) షూటింగ్ స్పాట్ నుంచి ఓ వీడియో లీకై సోషల్ మీడియా లో వైరల్ అవడంతో మేకర్స్ అలెర్ట్ అయి వెంటనే ఆ వీడియోను తొలగించి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇదే సమస్య మరో భారీ బడ్జెట్ సినిమాకు వచ్చింది. ప్రభాస్(prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజి(Fauji) సినిమా సెట్స్ నుంచి ఓ ఫోటో తాజాగా లీకైంది. లీకైన ఫోటోలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించడంతో ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. దీంతో ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) రియాక్ట్ అయ్యారు.
ప్రేక్షకులకు గొప్ప అనుభవాన్ని ఇవ్వడానికి మేం శాయశక్తులా ప్రయత్నిస్తుంటే, ఇలాంటి లీకులు సినిమాపై ఆడియన్స్ కు ఉన్న ఆసక్తిని తగ్గించడంతో పాటూ చిత్ర యూనిట్ యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తాయని, లీక్ ఫోటోలు షేర్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లను తొలగించడమే కాకుండా సైబర్ నేరం కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.







