Fauji: ఫౌజీ కూడా వచ్చే ఏడాదే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఓ వైపు మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab) చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి(hanu raghavapudi) డైరెక్షన్ లో ఫౌజీ(Fauji) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండూ కాకుండా అతని లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అయితే అన్నింటికంటే ముందు రాజా సాబ్ రిలీజ్ కానుంది. వాస్తవానికి డిసెంబర్ లో రావాల్సిన రాజా సాబ్ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది.
ప్రస్తుతం రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ కోసం గ్రీస్ వెళ్లిన డార్లింగ్, ఆ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఇండియా రానున్నాడు. ఇదిలా ఉంటే రాజా సాబ్ తో పాటూ ఫౌజీ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను కూడా ఆల్మోస్ట్ ఆఖరి దశకు తీసుకొచ్చాడని తెలుస్తోంది. ఫౌజీ మూవీకి సంబంధించి మరో 25 రోజుల టాకీ పార్ట్ మరియు ఫైట్ సీన్స్ మాత్రమే బాకీ ఉన్నాయని సమాచారం.
వీలైనంత త్వరగా వాటిని కూడా పూర్తి చేసి ఫౌజీ సినిమాను 2026 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే వచ్చే ఏడాది డార్లింగ్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అవుతాయన్నమాట. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉండగా, ఫౌజీలో ఇమాన్వీ ఇస్మాయెల్(Imanvi esmael) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.