సమంత ఇలా అయిందేంటి?
మొన్నటివరకు స్టార్ హీరోల పక్కన నటించి టాప్ హీరోయిన్ క్రేజ్ ను ఎంజాయ్ చేసిన సమంత కొత్త లుక్స్ ఫ్యాన్స్ ను టెన్షన్ పడేలా చేస్తున్నాయి. రీసెంట్ గా ఓ స్పెషల్ ఫోటో షూట్ నుంచి వచ్చిన స్టిల్స్ చూస్తే సంతోషానికి బదులు ఆందోళన కలుగుతుంది. ఆ ఫోటోషూట్ లో సమంత లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి.
మొహం మొత్తం పేలగా అయిపోయి జుట్టు విరబోసుకుని ఇచ్చిన పోజులు కిక్ ఇచ్చేలా లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఖుషి సినిమాలో కూడా చలాకీగా కనిపించిన సామ్ కు సడెన్ గా ఏమైందని అందరూ కంగారు పడుతున్నారు. మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్లీ కొత్త ఇన్నింగ్స్ ను ప్లాన్ చేసుకుంటుంది.
ఖుషి తర్వాత కొత్త కమిట్మెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సమంతకు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు అందుకోవడం కాస్త కష్టమే. అందుకే ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా దర్శకనిర్మాతలకు తను సినిమాలకు రెడీ అవుతున్నట్లు సిగ్నల్స్ ఇస్తుంది. ఒకవేళ అమ్మడుకు సినిమా ఛాన్సులు రాకపోయినా ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించే ఆఫర్లు మాత్రం క్యూ కడతాయి. సమంత నటించిన సిటాడెల్ త్వరలోనే రిలీజ్ కానుంది.













