Sruthi Haasan: శృతి హాసన్‌కు ఫ్యాన్స్ విన్నపం
కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్(Sruthi Haasan) కెరీర్ మొదట్లో ఫ్లాపులతో ఇబ్బంది పడినప్పటికీ తర్వాత తక్కువ టైమ్ లోనే సౌత్ లో మంచి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. జనవరి 28న పుట్టిన రోజు జరుపుకున్న శృతి హాసన్ 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
తనకు విషెస్ తెలిపిన అందరికీ శృతి థ్యాంక్స్ చెప్తూ ఓ నోట్ ను రిలీజ్ చేసింది. ఆ నోట్ లో తనకు 2025 మొమొరబుల్ ఇయర్ అని, ఆల్రెడీ దాన్ని తను ఫీలవుతున్నట్టు శృతి ఆ నోట్ లో తెలిపింది. అయితే ఆ నోట్ కు ఆమె ఫ్యాన్స్ కొంతమంది 2025లో పెళ్లి చేసుకుని దాన్ని మరింత మమొరబుల్ ఇయర్ చేయమని, 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టక ముందే పెళ్లి చేసుకోమని శృతికి సలహా ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ శృతికి పెళ్లి మీద పెద్దగా మంచి అభిప్రాయం లేదని, లివింగ్ రిలేషన్షిప్ అంటేనే ఇష్టమని చెప్పిన శృతి తన ఫ్యాన్స్ కామెంట్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. ఇక కెరీర్ విషయానికిస్తే ప్రస్తుతం రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కుతున్న కూలీలో కీలక పాత్ర చేస్తున్న శృతి, తమిళ సినిమా ట్రైన్(Train) తో పాటూ సలార్2(Salaar2) కూడా తన చేతిలో ఉన్నాయి.













