Amithabh: అమితాబ్ పోస్ట్ కు ఫ్యాన్స్ ఫిదా

అమితాబ్ బచ్చన్(Amitabh Bachan) కు ఉన్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. ఆయన హీరోగా, యాక్టర్ గా ఎన్నో సినిమాలు చేశారు. హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు అమితాబ్ బచ్చన్. 82 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో కష్టపడుతూ ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. అమితాబ్ అంటే ఫ్యాన్స్ కు ఎంతిష్టమో ఫ్యాన్స్ అంటే అమితాబ్ కు కూడా అంతే ఇష్టం.
భాషతో పట్టింపు లేకుండా ఆయన అన్ని భాషల ఫ్యాన్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అమితాబ్ శుక్రవారం ఎక్స్ లో మూడు పోస్టులు చేశారు. తెలుగు, తమిళ, మరాఠీ భాషల్లో అమితాబ్ చేసిన పోస్ట్ అందిరీన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రార్థనలు: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి, వ్యాధి లేకుండా ఉండండి, సుభిక్షంగా ఉండండి అంటూ అమితాబ్ ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరలవుతుంది.
ఆ పోస్ట్ కు చివరిలో ఓం తో పాటూ ప్రార్థన చేతులు, ఓ గుడి ఎమోజీలను కూడా జోడించారు అమితాబ్. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు సడెన్ గా అమితాబ్ ఈ పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశమేంటని అందరూ ఆరా తీస్తుండగా, మరికొందరు మాత్రం కారణమేదైనా అమితాబ్ కు అభిమానులపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుతూ ఆయన పోస్ట్ చూసి ఖుషీ అవుతున్నారు.
https://x.com/srbachchan/status/1946137729638797417?s=46&t=WY6ojOJj3zQGHgXs84FgLA