ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
గతంలో విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీత గోవిందం సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు విజయ్ గత మూవీ ఖుషి ఓ మోస్తరుగా ఆడటంతో ఫ్యామిలీ స్టార్ ఎట్టి పరిస్థితుల్లో మంచి హిట్ అవనుందనే కాన్ఫిడెన్స్ తో విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇప్పటికే సినిమాపై మంచి హైప్ నెలకొనడంతో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ వరకే ప్రపంచ వ్యాప్తంగా రూ.45 కోట్లకు బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. విజయ్ మార్కెట్ కు ఇది చాలా ఎక్కువ. వరుస సక్సెస్ల్లో ఉన్న నాని మూవీస్ కు కూడా ఈ రేంజ్ బిజినెస్ అవడం లేదు. గీతగోవిందం లాగా ఈ సినిమా కూడా మ్యాజిక్ చేస్తుందని బయ్యర్లు భావిస్తున్నారు. ఈ మూవీ కోసం దిల్ రాజు ప్రమోషన్స్ తో కలిపి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మొత్తానికి ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఇప్పటివరకు ప్రాఫిటబుల్ గానే ఉన్నాడు.













