ఫ్యామిలీ స్టార్ వల్ల ట్రెండ్ అవుతున్న చైతూ, అరవింద్
ఫ్యామిలీ స్టార్ రిలీజ్ తర్వాత నాగచైతన్య, అల్లు అరవింద్ పేర్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ చూశాక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న లక్కీ పర్సన్స్ వీళ్లేనంటూ ఫ్యాన్స్ రకరకాల మీమ్స్, వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి కారణాలు ఎక్కువ మందికి తెలిసినా, మరికొన్ని లోతైన అంశాలు కూడా ఉన్నాయి.
వాస్తవానికి సర్కారు వారి పాట సినిమా కంటే ముందే డైరెక్టర్ పరశురామ్, చైతూకి ఓ స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించినప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా స్టార్ట్ చేశారు. కానీ ఈ లోపు మహేష్ నుంచి పరశురామ్ కు ఆఫర్ రావడంతో చైతూ ప్రాజెక్ట్ ను పెండింగ్ పెట్టి సర్కారు వారి పాట చేసి యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నాడు.
మరోవైపు పరశురామ్ స్టార్ నిర్మాత అయిన అల్లు అరవింద్ కు కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. దాన్ని విజయ్ దేవరకొండతోనే చేయాల్సి ఉందని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. కానీ ఈ లోపు పరశురామ్, దిల్ రాజుతో విజయ్ హీరోగా సినిమాను సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ఈ లోపే అరవింద్ పరశురామ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. దీంతో అరవింద్ హర్ట్ అయి సీరియస్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకున్నాడు. కానీ అనవసరమైన రచ్చ ఎందుకని ఆయన సన్నిహితులు ఆపేశారట. కట్ చేస్తే ఇప్పడు ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ఏమంత ఆశాజనకంగా లేదు. యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం అస్సలు బాలేవు. ఇవన్నీ చూసి చైతూ, అల్లు అరవింద్ పరశురామ్ బారి నుంచి లక్కీగా తప్పించుకున్నారని అందరూ అంటున్నారు.













