ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ
అగ్రెసివ్ హీరోయిజంతో చేసిన సినిమాలు విజయ్ దేవరకొండకు మంచి రిజల్ట్స్ ను ఇవ్వకపోవడంతో తిరిగి గీత గోవిందం లాంటి జోనర్‌కు వచ్చేశాడు విజయ్. ఖుషి మూవీ తర్వాత విజయ్, పరశురామ్ పెట్లతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్లో 13వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మధ్య తరగతి కుర్రాడిలా కనిపించాడు. ఉదయాన్నే లేచి ఉల్లిపాయలు తెచ్చి, పిల్లల్ని స్కూల్ కు డ్రాప్ చేసే సదరు మామూలు వ్యక్తిగా విజయ్ను పరిచయం చేశాడు. గొడవలకు దూరంగా ఉండే విజయ్ను ఓ పంచాయితీ కోసం పిలిచిన విలన్ విజయ్ను ఆడవాళ్లు చేసే పనులు చేస్తాడని ఎగతాళి చేస్తాడు.
దానికి విజయ్ ఓ ఇనుప రాడ్‌ను వంచి, ఓ రౌడీ తలను పగలకొట్టి తన రీతిలో కౌంటర్ ఇస్తాడు. హీరోయిన్ మృణాల్ ని జస్ట్ లాస్ట్ లో ఒక్క ఫ్రేమ్‌కు పరిమితం చేశారు. విజయ్ దేవరకొండను ఎలా చూపిస్తో ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారో తెలిసిన పరశురామ్ ఫ్యామిలీ స్టార్ పేరుతో వస్తున్న సినిమాలో అలానే చూపించాడు. గోపీ సుందర్ బీజీఎం, మోహనన్ సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా బాగున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానుందని టీజర్ లాస్ట్ లో తెలిపారు.













