ఫ్యామిలీ స్టార్ ప్లస్, మైనస్సులు
మరో వారం రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ థియేటర్లలోకి రానుంది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్-హీరో కాంబో కావడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. ఖుషి సినిమా బాగానే ఆడినా విజయ్ అనుకున్నంత హిట్ అవలేకపోయింది. దీంతో విజయ్ ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ మీదే పెట్టుకున్నాడు.
ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని తన బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు విజయ్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కొన్ని అవరోధాలు, అవకాశాలున్నాయి. అవేంటో చూద్దాం. మార్చిని ఘనంగా ముగించిన టిల్లు స్వ్కేర్ రెండో వారంలోనే స్లో అయ్యేట్లు కనిపించడం లేదు. పైగా యూత్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటప్పుడు యూత్ ను ఎట్రాక్ట్ చేయడం ఫ్యామిలీ స్టార్ కు అంత ఈజీ కాదు. మరోవైపు ఎండలు పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు ఐపీఎల్. అన్నింటినీ మించి ట్రైలర్ కు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.
ఇక అవకాశాల విషయానికొస్తే హనుమాన్ తర్వాత టాలీవుడ్ లో కంప్లీట్ ఫ్యామిలీ మూవీ వచ్చింది లేదు. కాబట్టి కుటుంబ అనుబంధాలకు, ఎమోషన్స్ కు ఈ సినిమాలో పెద్ద పీట వేసి ఆడియన్స్ కు సరిగా కనెక్ట్ చేయగలిగితే మాత్రం ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్ అవడం ఖాయం. వీటితో పాటూ మృణాల్ ఠాకూర్ లక్, గోపీ సుందర్ మ్యూజిక్, రష్మిక సర్ప్రైజ్ క్యామియో, సిస్టర్ సెంటిమెంట్ ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ కు కలిసొచ్చే అంశాలే. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఫ్యామిలీ స్టార్ తో విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













