ఫ్యామిలీ స్టార్ ను టార్గెట్ చేస్తున్న నెటిజన్లు
మరో 20 రోజుల్లో విజయ్ దేవరకొండ, మృణాల్ కలయికలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవడంతో సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. దానికి తోడు గీత గోవిందం సినిమా తర్వాత విజయ్- పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై మంచి క్రేజ్ ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్లో నెటిజన్లు లాజిక్స్ వెతికి ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన కళ్యాణి వచ్చా సాంగ్ లో ఓ మధ్య తరగతి యువకుడు అంత ఖరీదైన పెళ్లి ఎలా చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈసినిమా డ్రీమ్ సాంగ్ అయుండొచ్చు కదా అని ఫ్యాన్స్ అంటున్నారు.
మరికొందరు టీజర్లో ఓ సీన్లో విజయ్, దోశ పెనం మీద పేపర్ లాంటిది తీస్తూ ఎదురుగా ఉన్న అభినయ ప్లేట్ లో వేస్తాడు. స్లో మోషన్ లో చూస్తే అది పేపర్ అని క్లియర్ గా తెలుస్తోంది. ట్విట్టర్ లో దీని గురించి ఒకరు ప్రశ్నించగా, నిర్మాణ సంస్థ అఫీషియల్ అకౌంట్ నుంచి కాస్త ఓపిక పట్టమని దానికి రిప్లై వచ్చింది. మొత్తానికి ఏదోలా ఫ్యామిలీ స్టార్ నెట్టింట టార్గెట్ అవుతూ అందరి నోళ్లలో బాగానే నానుతున్నాడు. ఖుషి తర్వాత చేస్తున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.













