రానా త్రిభాషా చిత్రం
దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. మూడు భాషల్లో రూపొందిన సినిమా హథీ మేరే సాథి, కాండన్, అరణ్య సినిమా పోస్టర్స్‌ను ఈరోస్ సంస్థ విడుదల చేసింది. ఈ సందర్బంగా ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ సునీల్ లుల్లా మాట్లాడుతూ ఈ సినిమాను మూడు టైటిల్స్‌తో మూడు భాషల్లో విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌కు చాలా స్పెషల్ మూవీగా భావిస్తున్నాం. యూనిక్ స్టోరీ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు.













