స్పోర్ట్స్ వేర్ లో ఈషా అందాల ఆరబోత….
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అందులో మొదటగా గుర్తొచ్చే పేరు ఈషా రెబ్బ. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుంటూ హీరోయిన్ గా మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. హీరోయిన్ గా ఈ అమ్మడి జర్నీ సాఫీగా సాగుతోంది. స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం అయితే రావడం లేదు కానీ, మంచి సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.
సినిమాలతో కంటే కూడా ఈ అమ్మడికి ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కింది. హీరోయిన్ గా చేస్తున్న సినిమాలు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెడుతూ ఉంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటో షూట్స్ మాత్రం ఓక్ రేంజ్ లో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు తన అందంతో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఆకట్టుకునే అందం తో పాటు ఈషా పర్ఫెక్ట్ ఫిజిక్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
తాజాగా స్పోర్ట్స్ వేర్ లో ఈషా ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడి అందాలను చూసి మతి పోయినంత పని అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టు లో అయినా, మోడ్రన్ డ్రస్ లో అయినా ఇలా స్పోర్ట్స్ వేర్ లో అయినా కూడా ఈషా అదరగొడ్తుందని అంటున్నారు.
ఇంత అందగత్తెను మన తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు, ఈషాకు సరైన అవకాశాలు టాలీవుడ్టూ లో దొరకటల్లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ అమ్మడి టాలెంట్ ని గుర్తించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ముంబయి ముద్దుగుమ్మలు ఇంతకంటే బాగుంటారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి స్పోర్ట్స్ వేర్ లో ఈషా అందాలని నెటిజన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు..













