మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టనున్న గుంటూరుకారం
మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. గుంటూరు కారంను ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12న విడుదల చేసి సంక్రాంతి రేసులో నిలబెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీమ్ దమ్ మసాలా సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ ఓ వీడియో కూడా బయటకొచ్చింది. హైదరాబాద్ లో ఓ స్పెషల్ సెట్లో దమ్ మసాలా సాంగ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా, ఆన్ లొకేషన్ వీడియో ఒకటి లీక్ అయింది. లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు డ్యాన్స్ చేస్తున్నాడు.
మహేష్ డ్యాన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉందని చూసిన ఫ్యాన్స్ భలే హ్యాపీ ఫీలవుతున్నారు. దమ్ మసాలా సాంగ్ కు తగ్గట్టే మాస్ స్టెప్స్ ను కంపోజ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా క్లాస్ సినిమాలే చేస్తున్న మహేష్ బాబు సినిమాల్లో మాస్ అప్పీల్ తగ్గిపోతుందనుకుంటున్న ఫ్యాన్స్ కు గుంటూరు కారం సినిమా ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













