Dude: ప్రదీప్ రంగనాథన్ సినిమాకు భారీ ఓటీటీ డీల్

డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganadhan) వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రదీప్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన మొదటి సినిమా లవ్ టుడే(Love Today) మంచి హిట్ అవడంతో ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. డ్రాగన్(Dragon) సినిమాలోని కంటెంట్ కూడా ఆడియన్స్ కు నచ్చడంతో ఆ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
డ్రాగన్ సినిమాతో తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆ మూవీతో రూ.100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరాడు. డ్రాగన్ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న ప్రదీప్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Love Insurence Company) కాగా రెండోది డ్యూడ్(Dude). కీర్తీశ్వరన్(Keerthiswaran) దర్శకుడిగా పరిచయమవుతున్న డ్యూడ్ సినిమాలో మమిత బైజు(Mamitha byju) హీరోయిన్ గా నటిస్తుంది.
డ్యూడ్ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తుండగా, ఈ సినిమాలో సీనియర్ హీరో శరత్ కుమార్(Sharath Kumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. డ్యూడ్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ డ్యూడ్ మూవీని రూ.25 కోట్లకు కొనుక్కుందని అంటున్నారు. ప్రదీప్ కు ఉన్న మార్కెట్ కారణంగానే నెట్‌ఫ్లిక్స్ డ్యూడ్ రైట్స్ కోసం అంత ఖర్చు పెట్టిందని సమాచారం. ఈ ఇయర్ దీపావళికి డ్యూడ్ రిలీజ్ కానుంది.