Dude: డ్యూడ్ ఓటీటీ రేటుకు కారణం వాళ్లేనా?

లవ్ టుడే(Love today), డ్రాగన్(Dragon) సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేయడంతో ప్రదీప్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అందులో భాగంగానే అతనికి వరుస అవకాశాలొచ్చాయి. ప్రస్తుతం ప్రదీప్ రెండు సినిమాలు చేస్తుండగా అందులో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Love Insurance Company) ఒకటి, రెండోది డ్యూడ్(Dude).
ఇందులో డ్యూడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తుండగా కీర్తీశ్వరన్(Keerthiswaran) డ్యూడ్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. డ్యూడ్ సినిమాలో ప్రేమలు(Premalu) ఫేమ్ మమిత బైజు(Mamitha Baiju) హీరోయిన్ గా నటిస్తుంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా డ్యూడ్ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అటు డ్రాగన్ సినిమాతో ప్రదీప్ రంగనాథన్, ఇటు ప్రేమలు సినిమాతో మమిత బైజు ఇద్దరూ రూ.100 కోట్ల మార్కెట్ ను అందుకోవడంతో వారి క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే నెట్‌ఫ్లిక్స్ డ్యూడ్ కోసం అంత భారీ రేటును కేటాయించినట్టు తెలుస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్‌కే ఈ రేంజ్ బిజినెస్ జరిగితే ఇక మిగిలిన వాటి బిజినెస్ కూడా పూర్తైతే ఈ సినిమా రిలీజ్ కు ముందే లాభాల్లోకి వెళ్లడం గ్యారెంటీ అనిపిస్తుంది.