Dude: ‘డ్యూడ్’100 కోట్లు క్రాస్ చేయడం చాలా హ్యాపీగా వుంది : ప్రదీప్ రంగనాథన్
యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ డ్యూడ్ (Dude). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ ని నిర్వహించారు.
డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ… డ్యూడ్ సినిమా 100 కోట్లు కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలపడానికి ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. ఆడియన్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. లవ్ టు డే. డ్రాగన్ చిత్రాలకు ఎంత ఆదరణ ఇచ్చారో ఈ చిత్రానికి కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీ సపోర్ట్ కి ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ… మైత్రి మూవీ మేకర్స్ 2000 కోట్ల సినిమాని చూసిన నిర్మాతలు. వారికి ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్ వస్తుంటుంది. దీపావళికి వచ్చిన ఈ సినిమా పాన్ సౌత్ బ్లాక్ బాస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు రవి గారి విజన్ వేరు. వాళ్ళ కిరీటంలో మరో మైలురాయి చేరినందుకు అభినందనలు. తొలి సినిమా విజయం సాధించడం చాలా స్పెషల్ అందులో 100 కోట్ల సినిమా సాధించిన డైరెక్టర్ కీర్తికి కంగ్రాజులేషన్స్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తున్నంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను. మమిత లక్కీ హ్యాండ్. అద్భుతంగా నటించారు. తనకు మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా విషయానికొస్తే తెలుగు తమిళ్ ఒకే స్టేట్. తమిళ్ స్టార్స్ కూడా మా స్టార్స్ గానే ఫీల్ అవుతాము. కమల్ హాసన్ గారు, రజినీకాంత్ గారు, సూర్య గారు, అజిత్ గారు, ధనుష్ గారు, విజయ్ సేతుపతి గారు ఇలా ఎవరొచ్చినా సరే మా సొంత సినిమాలానే ప్రేమిస్తాం. ప్రదీప్ గారు కూడా ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. మూడుసార్లు ఇండస్ట్రీని షేక్ చేసి వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చారు. ప్రదీప్ గారు కేవలం హీరో మెటీరియల్ కాదు యాక్టర్ మెటీరియల్ స్టార్ మెటీరియల్. ప్రదీప్ గారు ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ మమిత బైజు మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా 100 కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఇది మరింత స్పెషల్ మూమెంట్. అడియన్స్ సపోర్టుకి థాంక్యూ. వారి సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై కోస్టార్ ప్రదీప్ కి, డైరెక్టర్ కీర్తికి థాంక్యూ సో మచ్ ఇంత ప్రేమనిచ్చిన తెలుగు ఆడియన్స్ కి థాంక్యూ.
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డ్యూడ్ సినిమా సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో పనిచేసిన మా సూపర్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ గారికి, మమిత బైజు గారికి, మా డైరెక్టర్ కీర్తి, టీమ్ అందరికీ థాంక్ యూ. శరత్ కుమార్ గారు అద్భుతమైన పాత్రను పోషించారు. మాకు చాలా మెమొరబుల్ ఫిల్మ్ ఇచ్చారు. సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా సంస్థలో పరిచయమైన భరత్ కమ్మ, నితీష్ రానా, బుచ్చిబాబు సనా చాలా పెద్దదర్శకులు అయ్యారు. ఇప్పుడు అదే కేటగిరిలో కీర్తి చేయడం చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ.
డైరెక్టర్ కీర్తి ఈశ్వర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రదీప్ రంగనాథన్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. ఇది నా ఫస్ట్ సినిమా. ఇలాంటి కొలబరేషన్లో అద్భుతమైన విజయం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు.ఈ సినిమాలో గగన్ క్యారెక్టర్ రాయడానికి చాలా తెలుగు సినిమాల ఇన్స్పిరేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అద్భుతంగా రన్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారికి రవి గారికి థాంక్యూ. ప్రదీప్, మమిత మా టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కొన్ని సీన్స్ ఎన్నిసార్లు చూసినా థియేటర్స్ లో బోర్ కొట్టడం లేదు. ప్రదీప్ మమిత గారి యాక్టింగ్ సూపర్బ్. ఇంటర్వెల్ బ్లాక్స్ సీన్ అయితే గూజ్ బంప్స్ తెప్పించింది. థియేటర్ మొత్తం రియాక్ట్ అవుతున్నారు. సెకండా హాఫ్ ఎక్స్ట్రార్డినరీ. థియేటర్లో సినిమా సూపర్ గా రన్ అవుతుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎమోషన్ లవ్ స్టోరీ ఉన్న సినిమాని తప్పకుండా థియేటర్స్ లో వాచ్ చేయండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన రవి గారికి, నవీన్ గారికి థాంక్యూ వెరీ మచ్.
రైటర్ కృష్ణ మాట్లాడుతూ…అందరికీ థాంక్యూ. కథ రాసిన కీర్తి గారికి చేసిన ప్రదీప్ గారికి థాంక్యూ. ఈ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేసినందుకు మమత గారికి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ అద్భుతంగా తీశారు. డైలాగులు రాస్తున్నప్పుడే ఖచ్చితంగా 100 కోట్లు కొడుతుందని అనుకున్నాను. ఇది డ్యూడ్ దివాళి ఈ అవకాశం ఇచ్చిన రవి గారికి నవీన్ గారికి థాంక్యూ.







