Dragon: డ్రాగన్ కోసం యూరప్ కు తారక్
ఆర్ఆర్ఆర్(RRR) తో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR). ఆ తర్వాత కొరటాల శివ(Korata siva)తో దేవర(devara) తీసి మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్న తారక్(tarak), తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrithik roshan) తో కలిసి వార్2(war2) సినిమా చేసి దాంతో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి మూవీ కావడంతో అందరికీ దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
భారీ అంచనాల మధ్య రిలీజైన వార్2 ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వార్2 సినిమా ఫ్లాపైనా ఎన్టీఆర్ కు నార్త్ లో క్రేజ్ మాత్రం బాగా ఏర్పడింది. ఇదిలా ఉంటే తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో డ్రాగన్(dragon) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఎన్టీఆర్, నీల్(Neel) కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటూ, తారక్ ఈ సినిమా కోసం చాలా స్లిమ్ గా తయారై డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుండటంతో డ్రాగన్ పై భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ మూడో వారం నుంచి యూరప్ లో జరగనుందని, ఇప్పటికే మేకర్స్ ఆ షెడ్యూల్ కోసం ఏర్పాట్లను చేస్తున్నారని తెలుస్తోంది.







