NTRNeel: డ్రాగన్ మూవీ పై క్రేజీ అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సలార్(Salaar) తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకే ఎన్టీఆర్‌నీల్(NTRNeel) సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌నీల్ నెక్ట్స్ షెడ్యూల్ లో సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట. ఈ సీక్వెన్స్ కోసం స్పెషల్ గా ఓ భారీ టెంపుల్ సెట్ ను కూడా మేకర్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తంలో ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని, ఈ సీక్వెన్స్ మొత్తం ఎన్టీఆర్, విలన్స్ పైనే నడవనుందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు డ్రాగన్(Dragon) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తుండగా, ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలపాలని నీల్ ట్రై చేస్తున్నాడట. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ కోసం నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ లో డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.