ఫ్యాన్స్ కు షాకిచ్చిన డబుల్ ఇస్మార్ట్
ఓ వైపు నార్త్ మల్టీప్లెక్సులు థియేటర్, ఓటీటీ రిలీజ్ కు మధ్య కనీసం 8 వారాల గ్యాప్ ఉండే తప్ప స్క్రీన్స్ ఇవ్వమనే కండిషన్ ను పాటిస్తుంటే సౌత్ లో మాత్రం 3-4 వారాలు తిరక్కుండానే పెద్ద సినిమాలు సైతం డిజిటల్ లో రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ 21 రోజులకే ప్రైమ్ లోకి వచ్చేసింది.
వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని ముందుగా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే డబుల్ ఇస్మార్ట్ ప్రైమ్ లో రిలీజ్ అవడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన డబుల్ ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందనుకుంటే లైగర్ కంటే పెద్ద గాయాన్ని చేసింది.
ఈ సినిమా వల్ల రూ.40 కోట్ల వరకు నష్టమొచ్చిందని ట్రేడ్ టాక్. వారం రోజులు కూడా సరిగ్గా థియేటర్ రన్ లేని ఈ సినిమాకు మూడు వారాల గడువు ఎక్కువే అయినప్పటికీ ఓటీటీ విండో గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతున్న టైమ్ లో ఇలా జరగడం మాత్రం పెద్ద ట్విస్టే. డబుల్ ఇస్మార్ట్ సినిమా పూరీ కెరీర్లో ఓ పాఠంగా మిగిలిపోతుంది. హిట్ అయుంటే అంతా బానే ఉండేది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీన్ని ఎలా ట్రోల్ చేస్తారో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.













