హిందీలో డబుల్ ఇస్మార్ట్.. లైగర్ కంటే దారుణం!
లైగర్ డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ తో కలిసి ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తీశారు. ఈ సినిమా కథను కూడా పూరీ తనకు బాగా అలవాటైన రెగ్యులర్ టెంప్లెంట్ లోనే చెప్పడంతో ఆడియన్స్ దాన్ని రిజెక్ట్ చేశారు. కొత్త పాయింట్ తో వచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో పూరీ పెద్దగా తన పనితనాన్ని చూపించలేదు.
అందుకే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు. ఫస్ట్ షో కే డివైడ్ టాక్ రావడంతో ఆడియన్స్ ఈ సినిమాను పట్టించుకోలేదు. ఇప్పటివరకు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లో కనీసం 25% కూడా రికవరీ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు నార్త్ బెల్ట్ లో బాగా క్రేజ్ తీసుకురావడం కోసం సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకున్నారు.
ఈ సినిమా కోసం ఆయనకు ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. అయితే ఆయనకు ఇచ్చిన రెమ్యూనరేషన్ లో కనీసం 10% కూడా హిందీలో ఈ సినిమాకు కలెక్షన్స్ రాలేదు. ఇప్పటివరకు డబుల్ ఇస్మార్ట్ హిందీలో రూ.1.08 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే సంజయ్ దత్ క్రేజ్ ఈ సినిమాకు ఏ మాత్రం వర్కవుట్ అవలేదు. పూరీ గత సినిమా లైగర్ సైతం బాలీవుడ్ లో రూ.21.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం లైగర్ కు దరిదాపుల్లో కూడా లేదు.













