Gautham Menon: గౌతమ్ మీనన్‌కి ఎదురుచూపులు తప్పేలా లేవు
ఒకప్పుడు కల్ట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గా పేరున్న గౌతమ్ మీనన్(gautham Menon) ఇప్పుడు నటుడిగా మారిపోయాడు. కానీ ఏదొక రోజు ఆయన డైరెక్టర్ గా మారి మంచి కంబ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంఓనే ఆయన మల్లూవుడ్ లో అడుగు పెట్టి మమ్ముట్టి(Mammootty) హీరోగా డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్(Dominic and the ladies Purse) అనే సినిమా తీశాడు.
ఈ సినిమా నిన్నే రిలీజైంది. శివమణి(Sivamani) సినిమా తరహాలో ఈ సినిమా స్టోరీ ఉంది. కాకపోతే అది లవ్‌స్టోరీ దీన్ని కామెడీకి సస్పెన్స్ ను జోడించి గౌతమ్ మీనన్ కొత్తగా ట్రై చేశాడు. మమ్ముట్టి ఎప్పటిలాగే తన ఎక్స్‌పీరియెన్స్‌తో నెట్టుకొచ్చాడు. కానీ గౌతమ్ మీనన్ స్క్రీన్ ప్లే ఎప్పటిలానే స్లోగా ఉండటంతో పాటూ ఆడియన్స్ కు పెద్దగా కిక్క ఇవ్వలేకపోయింది.
మలయాళంలో ఇలాంటి థ్రిల్లర్స్ వర్కవుట్ అవడం కామనే కాబట్టి హిట్టవ్వొచ్చేమో కానీ వేరే డబ్బింగ్, రీమేక్ కు మాత్రం అవకాశం లేనట్టే. ఈ సినిమా మంచి హిట్ అయితే గౌతమ్ మీనన్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేయొచ్చనుకున్నాడు కానీ ఇప్పుడా అవకాశం లేనట్టే కనిపిస్తుంది. చూస్తుంటే గౌతమ్ మీనన్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకోవడానికి మరికొంత కాలం ఆగక తప్పేలా లేదు.













