బాలయ్యపై దృష్టి పెట్టిన ఆ డైరెక్టర్లు
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఉన్న ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్యకు ఇండస్ట్రీలో డిమాండ్ భారీగా పెరిగింది. అందులో భాగంగానే బాలయ్య, టాలీవుడ్ లోని కమర్షియల్ డైరెక్టర్లకు ఫస్ట్ ఛాయిస్ గా మారాడు. బాలయ్య గత మూడు సినిమాలూ హిట్సే.
పైగా ఈ మూడు సినిమాలూ రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. అందుకే బాలయ్యకు మార్కెట్ బాగా పెరిగింది. దానికి తోడు స్టార్ హీరోలు అందుబాటులో లేకపోవడంతో వాళ్లకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారాడు బాలయ్య. బోయపాటి, బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పూరీ లాంటి కమర్షియల్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వడానికి స్టార్ హీరోలు ఖాళీగా లేరు.
దీంతో అలాంటి డైరెక్టర్లందరికీ బాలయ్యే పెద్ద దిక్కయ్యాడు. సీనియర్ హీరోల్లో చిరంజీవితో చేయాలంటే భారీగా ఛార్జ్ చేస్తాడు కాబట్టి బడ్జెట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. 100 కోట్ల బడ్జెట్ సినిమాలు నాగ్, వెంకీ చేయలేరు. వారికి అంత మార్కెట్ లేదు. ఇక మిగిలిన ఆప్షన్ బాలయ్యే. బాలయ్య అయితే రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటాడు దానికి తోడు ఆయనకు మంచి మార్కెట్ కూడా ఉండటంతో ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్లందరూ బాలయ్య వెంట పడుతున్నారు.













