గండం నుంచి బయటపడ్డ విరూపాక్ష డైరెక్టర్
ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది. రీసెంట్గా దసరా సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. తనే కాదు ఈ శుక్రవారం రిలీజ్ కానున్న విరూపాక్ష సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కానున్న కార్తీక్ దండు కూడా సుకుమార్ కి ఒకప్పటి శిష్యుడే.
తన శిష్యుడు కార్తీక్ స్టోరీకి సుకుమారే స్వయంగా స్క్రీన్ ప్లే కూడా సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్, తన శిష్యుడు కార్తీక్ గురించి ఇంట్రెస్టింగ్ మేటర్‌ను వెల్లడించాడు. కార్తీక్ తనను మొదటిసారి కలిసే టైమ్‌కు తన లైఫ్ చాలా చిన్నదని, అప్పటికి ఐదారేళ్లకు మించి అతను బతికే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పారన్న విషయాన్ని సుకుమార్ సభాముఖంగా వెల్లడించాడు.
కార్తీక్ కు ఓ హెల్త్ ప్రాబ్లమ్ ఉందని, దాని వల్ల కార్తీక్ ప్లేట్లెట్స్ పడిపోయేవని, అలాంటి స్థితి నుంచి పోరాడి, విరూపాక్ష లాంటి సినిమాకు దర్శకత్వం వహించడం చిన్న విషయం కాదని సుకుమార్ చెప్పాడు. ఇంతటి తీవ్ర అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ, చనిపోయేలోపు ఓ సినిమా అయినా డైరెక్ట్ చేయాలని కార్తీక్ అనుకున్నాడని సుకుమార్ తెలిపాడు.
అయితే దీని కోసం చేసిన పోరాటంలో, తన పేరెంట్స్ ప్రార్థనల వల్ల, ఆ సమస్య నుంచి కార్తీక్ బయటపడ్డాడని సుకుమార్ పేర్కొన్నాడు. సినిమా గురించి మాట్లాడుతూ విరూపాక్ష సినిమాను కార్తీక్ ఎంతో బాగా తీర్చిదిద్దాడని, కథ చెప్పడం బాగా వచ్చినోడు, డైరెక్షన్ కూడా బాగా చేస్తాడని, కార్తీక్‌కు ఆ సత్తా ఉందని సుకుమార్ తీర్మానించాడు.













