Venky Kudumula: నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన దర్శకుడు వెంకీ కుడుముల
యూనిక్ స్టొరీ టెల్లింగ్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, యూత్ ఫుల్ ఫిల్మ్ మేకింగ్ సెన్సిబిలిటీస్ తో ఆకట్టుకునే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల, నిర్మాతగా కొత్త క్రియేటివ్ జర్నీని ప్రారంభించారు. తన కెరీర్లో ఈ ముఖ్యమైన మైల్ స్టోన్ ని పురస్కరించుకుని వెంకీ కుడుముల తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’పై తన తొలి ప్రొడక్షన్ వెంచర్ ని అనౌన్స్ చేశారు.
ఈ చిత్రంలో నటించే #NewGuyInTown గురించి రేపు టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు వెల్లడించనున్నారు. నూతన దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. సంచలన సంగీత దర్శకుడు ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, సినీ పరిశ్రమలో ప్రతిభావంతుడైన న్యూ ఫేస్ రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
ఈ కొత్త అధ్యాయం గురించి వెంకీ కుడుముల మాట్లాడుతూ.. కొత్త కథలను ప్రోత్సహించడం, కొత్త ప్రతిభకు అవకాశాలు ఇవ్వడం తన లక్ష్య. సినిమా అంటే నాకు అపారమైన ప్రేమ. ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. What Next Entertainments ద్వారా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న క్రియేటివ్ వాయిసెస్కి, చెప్పాల్సిన కథలకు ఒక వేదిక ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికైనా తొలి అడుగు వేయడానికి నేను సహాయం చేయగలిగితే, అదే నా అతిపెద్ద విజయం.
ఈ ప్రయత్నం ద్వారా వెంకీ కుడుముల కేవలం తెరపై ఆకట్టుకునే కథలను చెప్పడమే కాకుండా, తెరవెనుక కొత్త ఆలోచనలు, కొత్త ప్రతిభను పెంపొందించే నిర్మాతగా కూడా తన పాత్రను విస్తరించుకుంటున్నారు. ఒరిజినాలిటీ, ఇన్నోవేషన్, ఫ్రెష్ పర్స్పెక్టివ్లకు వేదికగా తన బ్యానర్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.






