మెగా156 గురించి వశిష్ట ఏమంటున్నాడంటే!
మెగా156 షూటింగ్ లో ఇంకా చిరంజీవి జాయిన్ అయింది లేదు కానీ ఈ సినిమా గురించి డైరెక్టర్ వశిష్ట చెప్తున్న వివరాలకు ఫ్యాన్స్ మతి పోతుంది. ఈ సినిమా గురించి డైరెక్టర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ టాప్ 3లో ఒకటిగా కచ్ఛితంగా ఉంటుందని చెప్పాడు.
అంతేకాదు, వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చేస్తున్న సినిమా భవిష్యత్తులో ఎప్పటికీ చెప్పుకునే గొప్ప సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం చూస్తే స్క్రిప్ట్ ఓ రేంజ్ లో రెడీ అయినట్లు కనిపిస్తోంది. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఈ సినిమా కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటుందని వశిష్ట అన్నాడు.
చిరూకి స్టోరీ వినిపించినప్పుడు ఏదైతే ఓకే చేయించుకున్నానో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పులు లేకుండా యదాతథంగా తెరకెక్కించేందుకు చిరూ ఫ్రీడమ్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. చిరూ ఇమేజ్ ను కొత్త దర్శకులు పెంచాల్సిన పనిలేదని, ఎంతో ఎత్తులో ఉన్న ఆ పేరుని చెడగొట్టకుండా కాపాడుకుంటే చాలని చెప్తుంటే వశిష్ట ఎంతో క్లారిటీతో ఉన్నాడని అర్థమవుతుంది.













