ఆ సినిమాకు త్రివిక్రమ్ సలహా
డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సిద్దూ జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లూ స్క్వేర్ సినిమాలో నటిస్తున్నాడు. కాస్త లేటయినా ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు సిద్దూ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను త్రివిక్రమ్ రెండు సార్లు చూసి కొన్ని మార్పులు సూచించాడని, కొన్ని సీన్స్ ను మళ్లీ రీషూట్ చేయాలని చెప్పడంతో సిద్దూ మరియు టిల్లూ స్వ్కేర్ టీమ్ ఇప్పుడు ఆ పనుల్లో పడ్డారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు.
త్వరలోనే మిగిలిన షూటింగ్‌తో పాటూ రీషూట్స్ కూడా పూర్తి చేసి మంచి అవుట్ పుట్ వచ్చేలా ముందుకెళ్తుందట చిత్ర యూనిట్. ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా డీజే టిల్లూకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.













