రాక్షసుడిలా మారిపోయిన సుకుమార్
డైరెక్టర్ సుకుమార్ తన సినిమా విషయంలో చాలా క్లారిటీగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. తాను తీసే ప్రతి ఫ్రేమ్, ప్రతీ లైన్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు. అందుకే చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా, ప్రతి ఎమోషన్‌ను చాలా జాగ్రత్తగా విజువలైజ్ చేస్తుంటాడు. ఈ విషయంలో సుకుమార్ ను అందరూ పని రాక్షసుడు అంటుంటారు.
ఇప్పుడు తను చేస్తున్న పుష్ప2 విషయంలో కూడా సుకుమార్ అంతే వ్యవహరిస్తున్నాడట. పుష్ప మూవీకి నేషనల్ అవార్డ్స్ రావడంతో ఇప్పుడు పుష్ప2 పై మరింత ఒత్తిడి ఉంది. ఆ సినిమా కంటే దీన్ని మరింత గ్రిప్పింగ్ గా తీయాల్సిన బాధ్యత సుకుమార్ పై పడింది. అందుకే పుష్ప2 లోని ప్రతి సీన్ ను చాలా డీటెయిలింగ్ గా విజువలైజ్ చేస్తున్నాడట సుకుమార్.
సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఎన్ని టేక్స్ అయినా తీయడానికి సుకుమార్ వెనుకాడట్లేదట. అందుకే పుష్ప2 మూవీ షూటింగ్ లేట్ అవుతుందని టాక్. రిలీజ్ ఆగస్ట్ లో కాబట్టి చాలా టైమ్ ఉందని సుకుమార్ ఇలా పని రాక్షసుడిలా మారి పుష్ప2ని కంప్లీట్ చేస్తున్నాడట. సుకుమార్ ఇంత కష్టపడుతున్న పుష్ప2 ఈసారి ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.













