సూపర్‌స్టార్ పిలిచాడు.. శివ పరిగెత్తాడు!
అజిత్‌తో వరుస సినిమాలు చేయడమే కాదు, భారీ విజయలూ అందుకుని సెన్షేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న తమిళ దర్శకుడు శివ-రజనీకి తగిన కథ కోసం భారీ కసరత్తు మొదలెట్టాడని అంటున్నారు. అజిత్‌తో శివ చేసిన అన్ని సినిమాలూ భారీ విజయాలే అందుకున్నాయి. ఈ దశలోనే శివకు సూర్యనుంచీ పిలుపు వచ్చింది. సూర్యతో సినిమాను ప్లాన్ చేసే సమయంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేసే అవకాశం తలుపుతట్టిందట. దాంతో రజనీ ప్రాజెక్టువైపే శివ మొగ్గు చూపాడని అంటున్నారు. అయితే తన పరిస్థితిని సూర్యకు వివరించి మరోసారి ప్రాజెక్టు చేద్దామంటూ సర్దిచెప్పుకున్నాడని టాక్. హీరో సూర్య నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రజనీని ఏ జోనర్లో చూపించాలన్న అంశంపై శివ టీం కసరత్తులు చేస్తోందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం మురగదాస్ ప్రాజెక్టుతో బిజీగా వున్న రజనీ- తదుపరి ప్రాజెక్టులో భాగంగా దర్శకుడు శివ చెప్పే కథను సెట్స్‌పైకి తీసుకెళ్తాడని అంటున్నారు.













