Game Changer: గేమ్ ఛేంజర్ శంకర్ చేసిన పెద్ద తప్పు ఇదే!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాకు బడ్జెట్ భారీగా అయిందని అందరికీ తెలుసు. అయితే దానికి కారణాలు సవాలక్ష అయిండొచ్చు. వాటిలో ముఖ్యమైంది మాత్రం ఆర్టిస్టులనే చెప్పాలి. ఫస్ట్ షాట్, మ్యారేజ్ డిన్నర్ సీన్ లో కాసేపు తప్పించి ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు.
ఎడిటింగ్ లో తీసేసినా ప్రియదర్శి(Priyadarshi) లాంటి పొటెన్షియాలిటీ ఉన్న నటులను సరిగా వాడుకోలేకపోవడం తప్పే అనుకోవాలి. ఎందుకంటే ప్రియదర్శి చిన్న ఆర్టిస్ట్ ఏమీ కాదు. సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బలగం(Balagam) మూవీ తర్వాత తన స్థాయి పెరిగింది. ప్రియదర్శి మాత్రమే కాదు సీనియర్ నరేష్(Naresh) కూడా కేవలం ఒక్క సీన్ కే పరిమితం చేశాడు.
చరణ్(Charan) ఇంటికొచ్చాక భోజనం దగ్గర రెండు ముక్కలు మాట్లాడ్డం తప్ప మళ్లీ ఎక్కడా కనిపించడు. అప్పన్న కొడుకు రామ్ నందన్ అసలు తన దగ్గరికెలా వచ్చాడనేది కూడా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కమెడియన్ సత్య(Satya), వైవా హర్ష(Viva Harsha)లను కూడా ఇంతే వాడుకున్నారు. అంతేకాదు 30 ఇయర్స్ పృథ్వీ(30 Years Prudhvi), రఘుబాబు(Raghu Babu), శుభలేఖ సుధాకర్(Subhaleka Sudhakar) లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు సినిమాలో చాలా మందే ఉన్నారు. వీళ్లందరూ తక్కువ రెమ్యూనరేషన్ కు వచ్చే వాళ్లు కాదు. ఇదంతా తప్పని చెప్పలేం కానీ కాస్టింగ్‌ను సరైన రీతిలో వాడుకోకపోవడం మాత్రం ఫెయిల్యూరనే చెప్పాలి.













