The Raja Saab: రాజా సాబ్ మ్యూజిక్ పై అంచనాలు పెంచేసిన మారుతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) చేస్తున్న సినిమాల్లో ది రాజా సాబ్(the Raja Saab) ఒకటి. ప్రభాస్ మారుతి(Maruthi) దర్శకత్వంలో మొదటిసారిగా నటిస్తున్న సినిమా ఇది. వాస్తవానికి మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజయ్యాయో అప్పటి నుంచి రాజా సాబ్ పై మంచి అంచనాలేర్పడ్డాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తోంది.
ప్రభాస్ తన కెరీర్లో మొదటి సారి ఈ జానర్లో సినిమా చేస్తుండటంతో రాజా సాబ్ పై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది లేదు. కనీసం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడనేది కూడా మేకర్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేసింది లేదు. దీంతో రాజా సాబ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు.
ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ తో పాటూ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రాజా సాబ్ టీజర్ జూన్ 16న రిలీజ్ కానుండగా, సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ డైరెక్టర్ మారుతి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దాంతో పాటూ రాజా సాబ్ లో తమన్(Thaman) ఇప్పటికే నాలుగు సాంగ్స్ ను పూర్తి చేశాడని, ఆ పాటలన్నీ డిఫరెంట్ థీమ్స్ తో డిజైన్ చేసినట్టు మారుతి చెప్పాడు. నాలుగు పాటల్లో మెలోడీస్ తో పాటూ మాస్ సాంగ్ కూడా ఉందని చెప్పి రాజా సాబ్ పై ఉన్న అంచనాలను ఆకాశానికి పెంచేశాడు. ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్లు గా నటిస్తున్నారు.