Raja Saab: రాజా సాబ్ లో ఆ డోస్ ఎక్కువే

ప్రభాస్(prabhas) సినిమాల్లో రొమాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది బాహుబలి(baahubali) సినిమా తర్వాత తన క్రేజ్ పెరిగిన నేపథ్యంలో ఆ కొంచెం రొమాన్స్ కూడా తగ్గించేశాడు ప్రభాస్. రాధే శ్యామ్(radhe shyam) తప్ప బాహుబలి తర్వాత మరే సినిమాలోనూ ప్రభాస్ కు లవ్ స్టోరీ లేదు. దీంతో హీరోయిన్ లేక విసిగిపోయిన ఫ్యాన్స్ తమ హీరో ఎప్పుడెప్పుడు రొమాంటిక్ సినిమా చేస్తాడా అని ఎదురుచూశారు.
ప్రభాస్ కూడా ఈ విషయాన్ని గ్రహించి రాజా సాబ్(raja saab) లో కుదిరితే ఇద్దరు హీరోయిన్లను పెట్టమని తనను అడిగాడని స్వయంగా డైరెక్టర్ మారుతి(maruthi)నే టీజర్ లాంచ్ ఈవెంట్ లో వెల్లడించాడు. ప్రభాస్ అడగడం నేను పెట్టకపోవడమా అని ఏకంగా ముగ్గురు హీరోయిన్లను లైన్ లోకి దింపాడు మారుతి. వాళ్లే మాళవిక మోహనన్(malavika mohanan), నిధి అగర్వాల్(niddhi Agerwal), రిద్ధి కుమార్(riddhi kumar).
గ్లామర్ క్వీన్లుగా పేరున్న నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ టీజర్ లో పోటీ పడి మరీ గ్లామర్ ను ఒలకబోయగా, రిద్ధి కుమార్ కనిపించిన ఒక్క షాట్ లోనే చాలా హాట్ గా ఉంది. మొత్తానికి ముగ్గురు హీరోయిన్లను తీసుకోవడమే కాకుండా వారిని గ్లామరస్ గా ప్రెజెంట్ చేయడంలో కూడా మారుతి సక్సెస్ అయ్యాడు. టీజర్ చూస్తేనే రాజా సాబ్ లో గ్లామర్ డోస్ ఎక్కువని క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తానికి రాజా సాబ్ రూపంలో ప్రభాస్ ను రొమాంటిక్ యాంగిల్ లో చూడాలనే ఫ్యాన్స్ కోరిక తీరబోతుంది.