ఆయన కోసం తెగ ట్రై చేస్తున్న బుచ్చిబాబు
ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించడానికి చాలానే టైమ్ తీసుకున్నాడు. ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నారు కానీ అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవడంతో రామ్ చరణ్, బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు.
ఈ సినిమా కథ ఎంతో పవర్ఫుల్ ఉంటుందని టాక్. దీనికోసం హీరో పాత్ర కంటే విలన్ క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉండాలని బుచ్చిబాబు ఆలోచించి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలను విలన్ గా తీసుకోవాలని నిర్మాతలతో కూడా చర్చించాడట. కానీ తర్వాత తన ఫోకస్ విజయ్ సేతుపతి మీద పడింది. ఉప్పెన సినిమాలో ఎలా అయితే తనను వాడుకున్నాడో ఇప్పుడు కూడా అలానే తన విలనిజాన్ని వాడుకోవాలని బుచ్చిబాబు డిసైడయ్యాడు.
కానీ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెద్ద పెద్ద సినిమాలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో బుచ్చిబాబు, సేతుపతే కావాలని పట్టుబట్టడం విశేషం. నిర్మాతలు కూడా బుచ్చిబాబు నిర్ణయానికి కట్టుబడి సేతుపతి డేట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతలా వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు కోసం సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయగలడో లేదో చూడాలి.













