Bobby: రాజమౌళినే వదల్లేదు.. నేనెంత: బాబీ
వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరీ డైరెక్టర్ బాబీ(Bobby), బాలయ్య(Balayya)తో డాకు మహారాజ్(Daku Maharaj) తీశాడు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన డాకు మహారాజా మంచి హిట్ అయింది. ఈ నేపథ్యంలో బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బలుపు(balupu) సినిమాకు వర్క్ చేసే వరకు ప్రపంచానికి బాబీ ఎవరో తెలియదని, ఆ సినిమా వల్ల తన కెరీర్ మారిపోయిందని తెలిపాడు.
నెగిటివ్ రివ్యూల గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు నెగిటివ్ రివ్యూలంటే ఏదో సరదాకి చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదని, సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ రివ్యూలు ప్రచారం చేస్తున్నారని, అయినా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా బాబీ అన్నాడు. ఈ రోజుల్లో కావాలనే సినిమాను చంపేస్తున్నారన్నాడు.
బాహుబలి(Baahubali) లాంటి సినిమా వచ్చినప్పుడే ఆ సినిమాలో కథ లేదని రాజమౌళి(rajamouli)ని ట్రోల్ చేశారు. తర్వాత బాహుబలి అన్ని రికార్డులను తిరగరాసి తెలుగు సినీ స్థాయిని అమాంతం పెంచేసింది. రాజమౌళి అంతటి వాడిపైనే ట్రోల్స్ వచ్చినప్పుడు ఇక నేనెంత అనిపిస్తుందని బాబీ అన్నాడు. తన గత సినిమా వాల్తేరు వీరయ్యకు రేటింగ్స్ చాలా తక్కువ ఇచ్చారని, కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని బాబీ తెలిపాడు.













