ఫ్యామిలీ స్టార్ పై దిల్ రాజు కాన్ఫిడెన్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గీత గోవిందం తర్వాత విజయ్- పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్ పై మంచి అంచనాలున్నాయి.
సినిమా మంచి బజ్ ఉండటంతో ఫ్యామిలీ స్టార్ బిజినెస్ పై దిల్ రాజు బాగా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో బాగానే కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీత గోవిందం వరల్డ్ వైడ్ గా రూ.65 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
అందుకే ఫ్యామిలీ స్టార్ కచ్ఛితంగా రూ.70 కోట్ల వరకు వసూలు చేస్తుందని దిల్ రాజు చాలా బలంగా నమ్ముతున్నాడట. ఈ రీజన్ తోనే థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు రూ. 50 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న కథలకు పాజిటివ్ రివ్యూలు వస్తేనే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి థియేటర్స్ లో చూస్తారు. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేస్తారు. మరి దిల్ రాజు లెక్కలు ఎప్పటికి తేలతాయో చూడాలి.













