ట్రాక్ తప్పానంటున్న దిల్ రాజు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని సక్సెస్ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు(Dil Raju) ఒకడు. తన మొదటి సినిమా దిల్(Dil) తో మంచి హిట్ అందుకున్న రాజు తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి దిల్ రాజుకు ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. థాంక్యూ(thankyou), శాకుంతలం(shaakunthalam), లవ్ మి(love me), ఫ్యామిలీ స్టార్(family star) సినిమాలతో వరుస ఫ్లాపులు అందుకున్నాడు.
అయితే ఈ మధ్య తాను సరైన సినిమాలు చేయడం లేదన్న విషయాన్ని స్వయంగా దిల్ రాజే ఒప్పుకున్నాడు. లక్కీ భాస్కర్(lucky baskhar) సక్సెస్‌మీట్ కు గెస్టుగా వచ్చిన రాజు, తాను ట్రాక్ తప్పిన విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు నిర్మాత నాగవంశీ(naga vamsi)లో తనని తాను చూసుకుంటున్నానని కూడా దిల్ రాజు పేర్కొన్నాడు.
తాను కూడా ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే విజయాలు సాధించానని, కానీ తర్వాత ట్రాక్ తప్పానని, ఇప్పుడు వంశీ అలాంటి సినిమాలతోనే హిట్లు అందుకుంటున్నాడని లక్కీ భాస్కర్ క్లాసిక్ గా నిలిచిపోతుందని, ఈ సినిమా వెంకీ(venky atluri) కెరీర్లోనే బెస్ట్ మూవీ అని చెప్పిన దిల్ రాజు తెలుగులో మహానటి(mahanati), సీతారామం(sitaramam), లక్కీ భాస్కర్(lucky bhaskar) లాంటి క్లాసిక్స్ తీసిన దుల్కర్(dulquer) తో తర్వాతి సినిమా చేసేవాళ్లు చాలా జాగ్రత్తగా సినిమా చేయాలని నవ్వుతూనే హెచ్చరించాడు.













