వారిద్దరి మధ్య తేడా ఏంటంటే?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. కొందరు సలార్ ను పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అంటుంటే, మరికొందరు చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు. అయితే కేజీఎఫ్ రెండు భాగాలు రిలీజయ్యాక ఎంతో మంది నీల్‌ను దర్శకధీరుడు రాజమౌళితో పోల్చారు.
ప్రశాంత్ నీల్ వల్ల కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి తర్వాతి స్థాయికి వెళ్లిందన్నది మాత్రం వాస్తవం. కేజీఎఫ్ తోనే శాండల్‌వుడ్ పేరు మార్మోగింది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కు కూడా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది ఆ సినిమాతోనే. కానీ రాజమౌళి తను తీసిన ప్రతి సినిమాతోనూ తెలుగు సినిమా స్థాయితో పాటూ ఇండియన్ సినిమా స్థాయిని కూడా పెంచుకుంటూ వస్తున్నాడు.
ఎంతో మంది వీరిద్దరినీ పోల్చినప్పటికీ వీరి మధ్య డిఫరెన్స్ ఉందని మూవీ విశ్లేషకులు చెప్తున్నారు. కథను, పాత్రలను ఇంట్రడ్యూస్ చేయడంలో వీరి మధ్య తేడా ఉందని అంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందు కథ, పాత్రలను చిన్నగా అయినా పరిచయం చేస్తే మూవీ కోసం ఆడియన్స్ బాగా ప్రిపేర్ అవుతారనేది రాజమౌళి స్ట్రాటజీ.
కానీ ప్రశాంత్ నీల్ మాత్రం క్యారెక్టర్లను పరిచయం చేయడంలో ఫెయిల్ అయ్యాడు. సలార్ రిలీజ్ కు ముందుకు ఖాన్సార్ ప్రపంచం గురించి అసలు ఏ మాత్రం పరిచయం చేయకుండా సినిమాలో కూడా సెకండాఫ్ లో పరిచయం చేశాడు. దీంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్కు గురయ్యారు. ఇదే రాజమౌళి, ప్రశాంత్ నీల్‌కు మధ్య ఉన్న తేడా అని చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు.













